Snakes Unique Trick | ఈ పాముల తెలివి మామూలుగా లేదుగా… వీడియో చూడండి..
పాములు విష జీవులను తింటాయా? ఈ విషయంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ–బర్కిలీకి చెందిన ప్రముఖ బయోలజిస్ట్ వలేరియా రామిరెజ్ కాస్టనేడా, ఆమె సహచర బృందం ఒక ఆసక్తికర ప్రయోగాన్ని నిర్వహించింది. దీని ఫలితాలు అబ్బురపరుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చలకు దారి తీసింది.
Snakes Unique Trick |ఈ ప్రయోగం కోసం వారు పది పాములను ఎంచుకున్నారు. వీటని కొలంబియాలోని అమెజాన్ అడవుల నుంచి పట్టుకొచ్చారు. వాటిని ప్రయోగశాలలో కొన్ని రోజులపాటు ఆకలికి అలమటించేలా చేశారు. ప్రయోగం నిర్వహించే రోజు పాములకు అసలు సహించని ఆహారం.. త్రీ స్ట్రిప్టడ్ పాయిజనస్ డార్ట్ ఫ్రాగ్స్.. ‘అమీరెగా ట్రివిట్టాటా’ (Ameerega trivittata)ను వదిలారు. వీటిని ఎంచుకోవడం వెనుక ఒక కారణం కూడా ఉంది. ఈ కప్పలు తమ శరీరంపై అత్యంత ప్రమాదకరమైన హిస్ట్రియోనోటాక్సిన్స్, ప్యూమిలియోటాక్సిన్స్, డెకాహైడ్రోక్వినోలిన్స్‌ను కలిగి ఉంటాయి. పది పాముల్లో రాయల్ గ్రౌండ్ పాములు… ఎరిత్రోలాంప్రస్ రెజినేలను పూర్తి నిరాహారంగా ఉంచారు. వాటిలో నాలుగు పాములను నేరుగా వదిలారు.
ఇక్కడ ఒక ఆసక్తికర సన్నివేశాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఆకలితో ఉన్న పాములు.. తమ ఆహారమైన కప్పలను నేల మీద డ్రాగ్ చేశాయి. కొన్ని రకాల పక్షులు తమ ఆహారం విషపూరితమైనవి అని తెలిసినప్పడు వాటిని నేల మీద రుద్దుతాయి. తద్వారా విషాన్ని వదిలిస్తాయి. ఇదే పద్ధతిలో ఈ పాములు సైతం ప్రవర్తించాయి. కాసేపు నేల మీద వాటిని రుద్ది.. ఆ తర్వాత మింగేశాయి. నాలుగు పాముల్లో మూడు పాములు విషపూరిత కప్పలను (వాటిని విషరహితాలు చేసుకున్నాక) తిన్నప్పటికీ జీవించి ఉండగలిగాయి. ఈ ప్రయోగంలో .. ఆ కప్పల్లో కొంత విషం మిగిలి ఉన్నప్పటికీ.. తమ శరీరాలు వాటిని తట్టుకోగలవని ఆ పాములు నిరూపించాయి.
జీవులు ఒకరినొకరు చంపుకొనేందుకు తమలో ఉన్న ప్రాణాంతక రసాయనాలను వందల కోట్ల సంవత్సరాల నుంచీ ఉపయోగిస్తున్నాయి. మొదట్లో సూక్ష్మజీవులు తమ పోటీదారులను తప్పించడానికి లేదా వాటిపై దాడి చేయడానికి ఉపయోగించాయి. తర్వాత జంతువులు ఇతర జంతువులను చంపడానికి లేదా, తమను చంపేందుకు వస్తున్నవాటిని ఎదుర్కొనడానికి ఉపయోగించాయి. మొక్కలు కూడా తమను తినే శాకాహార జీవులను చంపేందుకు వాడాయి.
ఇలాంటివాటికి ప్రతిస్పందనగా అనేక జంతువులు ఈ టాక్సిన్స్‌ను తట్టుకొని బతికే విధానాలను పరిణామ క్రమంలో అభివృద్ధి చేసుకున్నాయి. కొన్నిసార్లు అవే ఆ విషాలను తమ శరీరంలో నిల్వ చేసుకుని ప్రత్యర్ధులపై దాడి సమయంలో ఆయుధాలుగా వాడుకుంటాయి. ఇటువంటి విష నిరోధక రక్షణ విధానాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. పాము కాట్లకు గురైనవారికి మెరుగైన చికిత్సా మార్గాలను వాటి ద్వారా గుర్తించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి.
2023లో ప్రచురితమైన Annual Review of Ecology, Evolution, and Systematicsలో వలేరియా రామిరెజ్ కాస్టనేడా ఈ అంశంపై వివరంగా రాశారు. కింద వీడియోలో ఆ దృశ్యాలు చూడొచ్చు.
కొన్ని జీవులు తమ శరీరాల్లోనే విషపదార్థాలను తయారు చేస్తాయి. Bufonids toads అనే కప్పల జాతి ‘కార్డియాక్ గ్లైకోసైడ్స్’ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పదార్థాలు కణాల్లో పనిచేసే Sodium–potassium pump అనే ముఖ్యమైన ప్రోటీన్‌ను అడ్డుకుంటాయి. ఈ ప్రోటీన్ కణాల పరిమాణాన్ని నిలబెట్టడం, కండరాలు కుదించుకోవడం, నరాల సంకేతాలను పంపడం వంటి కీలక పనుల్లో భాగమవుతుంది. మరికొన్ని జంతువులు తమ శరీరాల్లో విషాన్ని తయారు చేసే బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు Pufferfish. వీటిలో ఉండే Tetrodotoxin అనే విషపదార్థం చాలా ప్రాణాంతకం. Poison dart frogs కూడా విషపూరితమైన పురుగులు, చిన్న కీటకాలను తింటాయి.
కొన్ని జంతువులు విషపూరితంగా మారినప్పుడు, అవే ఆ విషానికి గురి కాకుండా ఉండేందుకు తమ శరీర నిర్మాణాన్ని కూడా మార్చుకుంటాయి. అలాగే వాటిని తినే జంతువులు లేదా వాటి ఆహారంగా మారే జీవులు కూడా విషాన్ని తట్టుకునే విధానాలను అభివృద్ధి చేసుకుంటాయి. Red onion beetle అనే పురుగు విషపూరిత మొక్కలను తిన్నప్పటికీ, వాటిని శరీరం నుంచి బయటకు విసర్జిస్తుంది.
కొన్ని పాములలో విషాన్ని తట్టుకునే సామర్థ్యంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని టార్విన్ బృందం పరిశోధనల్లో తేలింది. ఉదాహరణకు పైన పేర్కొన్న ప్రయోగానికి ఎంచుకున్న Three-striped poison dart frog విషాన్ని తట్టుకునే విధంగా కొన్ని పాముల కాలేయంలో ప్రత్యేక ఎంజైములు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి ప్రమాదకర విషాలను హానికరంకాని పదార్థాలుగా మార్చేస్తాయి.
ఇవి కూడా చదవండి..
Narcisse Snake Dens | మైనస్ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో ఒకే చోట లక్షకుపైగా పాములు..
Sea Snakes | భయంకరమైన సముద్ర పాముల గురించి తెలుసా?
King Cobras Train Journey | రైలులో షికారుకెళ్లే కింగ్ కోబ్రాల కథ విన్నారా?
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram