సీఎం రేవంత్ రెడ్డి మాటలు అహంకార పూరితం : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
“పదేళ్లు నేనే సీఎం” అన్న రేవంత్ వ్యాఖ్యలు అహంకారపూరితమని రాజగోపాల్ రెడ్డి విమర్శ. జాతీయ నాయకత్వాన్ని అవమానిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు.
విధాత, హైదరాబాద్ : పదిన్నర ఏళ్ల పాటు తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అహంకార పూరితంగా, ప్రజాస్వామ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అవమానించినట్లుగా ఉన్నాయని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మీడియా చానెళ్లతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అనే రేవంత్ మాటలు వింటుంటే “వినాశకాలే విపరీత బుద్ధి” అనిపిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తది, రేవంత్ అలా పదే పదే అనడం అంటే మా జాతీయ నాయకత్వాన్ని అవమానించడమేనన్నారు. రేవంత్ రెడ్డి నేనే పదేళ్లు ముఖ్యమంత్రి అంటుంటే మంత్రులు, పీసీసీ చీఫ్, సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నెహ్రూ మొదలుకుని..ఇప్పటిదాక దేశంలో ఏ కాంగ్రెస్ ప్రధాని, సీఎంలు ముందుగానే నేనే పీఎం, సీఎం అని చెప్పుకోలేదని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అహంకారంతో నేనే పదేళ్లు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. అసలు తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెస్సా లేక రాహుల్ గాంధీ కాంగ్రెస్సా అని ప్రశ్నించారు. మేము కష్టపడితే, ప్రజలు మార్పు కోరుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయి, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎంగా వచ్చిన ఐదేళ్ల అవకాశంలో నిజాయితీగా పాలించకుండా అహంకారంతో పదిన్నరేళ్లు సీఎం అంటూ అహంకార పూరిత మాట్లాడటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
వెయ్యి మంది బలిదానంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం ఆంధ్రా పెత్తందారులు, చంద్రబాబు మనుషుల పెత్తనమే నడుస్తుంది.. వారికే పదవులు, కాంట్రాక్టులు వస్తున్నాయి అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఏమీ జరగడం లేదు అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి టీడీపీ కాంగ్రెస్ నాయకులదే నడుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ పార్టీనా..లేక టీడీపీ కాంగ్రెస్ పార్టీనా అన్నది అర్ధం కావడం లేదని, రెండేళ్లుగా కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. అసలు రేవంత్ రెడ్డి నేనే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా అని పదే పదే అంటున్నాడని..అసలు ఆయన ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు నెక్స్ట్ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్ లో ఉండి, ఎవరి మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు? అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
ఇవి కూడా చదవండి :
Chiranjeevi | మెగా కవలల పేర్లపై చిరంజీవి ప్రశంసలు.. సంస్కృతి–ఆధ్యాత్మికత కలిసిన నామకరణం అంటూ హర్షం
Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెలకు రూ.2.8లక్షల సంపాదన.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత జీతం రాదేమో..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram