Viral Video | రైలులో డ్యాన్స్‌లు, రీల్స్.. గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో 30 మంది ఫ్యామిలీ రచ్చ
Viral Video | గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్( Garib Rath Express )లో 30 మందితో కూడిన కుటుంబం డ్యాన్స్‌లు, రీల్స్‌తో నానా హంగామా చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Viral Video | సాధారణంగా రైలు ప్రయాణం ఒక జీవితాన్ని చూపిస్తుందని అంటుంటారు. కానీ కొంతమంది ప్రవర్తన వల్ల సాఫీగా సాగాల్సిన ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా సాగుతుంది. తాజాగా గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్( Garib Rath Express )లో 30 మందితో కూడిన కుటుంబం డ్యాన్స్‌లు, రీల్స్‌తో నానా హంగామా చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మన్మోహన్ వర్మ అనే ప్రయాణికుడు ఇటీవల గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. బిలాస్‌పూర్ నుంచి లక్నోకు అతను వెళ్తుండగా.. తమ బోగీలో సుమారు 25 నుంచి 30 మందితో కూడిన ఒక కుటుంబం ప్రయాణించిందని తెలిపాడు. అయితే ఆ ఫ్యామిలీ సాఫీగా జర్నీ చేయకుండా.. రైలును తమ ఇంటిలా ఫీలయిపోయి నానా రభసా చేశారని పేర్కొన్నారు. రైలులోనే పెద్ద పెద్ద సౌండ్లతో పాటలు పెట్టి, అరుచుకుంటూ.. డ్యాన్స్‌లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చిత్రీకరించిందని చెప్పాడు. గంటల పాటు ఇలాగే చేయడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని చెప్పాడు. దీంతో హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫిర్యాదు చేశామని.. రైల్వే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని వివరించాడు. ప్రశాంతంగా సాగాల్సిన తన రైలు ప్రయాణం ఒక లైవ్ రియాలిటీ షోలా మారిందని తెలిపాడు.
View this post on Instagram
అనంతరం తన అభిప్రాయాలను మన్మోహన్ పంచుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీస పౌర స్పృహ ఎందుకు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రైలులో అనేకమంది ప్రయాణిస్తుంటారని.. అది ఎవరో ఒకరి సొంతం కాదు.. అలాంటప్పుడు తోటి ప్రయాణికులను గౌరవిస్తూ హుందాగా నడుచుకోవడంపై ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నించాడు. మన్మోహన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బు ఉంది.. కానీ సమాజంలో ఎలా ప్రవర్తించాలనేది మాత్రం రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. రైళ్లు్, బస్సులు, మెట్రోల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు.
Read More:
Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?
Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram