వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం

వెనెజులాను వణికించిన వరుస భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 165కు చేరింది. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అంచనా వేస్తుండటంతో ఆందోళన నెలకొంది.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jun 25, 2026, 4:25 pm IST
Read Time: 3 mins
వెనెజులా భూకంపం రేపిన విషాదం.. 165కు చేరిన ప్రాణ నష్టం

వెనెజులా దేశాన్ని వణికించిన భూకంపాల తీవ్రత ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. భూకంప ధాటికి ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు కూలిన ఘటనలలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం చోటుచేసుకుంది. భూకంపం ఘటనలలో ఇప్పటిదాక మరణించిన వారి సంఖ్య 165కు చేరింది. మరో 1000మందిరి పైగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. భూకంపంతో ఎదురైన ప్రాణ, ఆస్థి నష్టం వివరానలు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ వెల్లడించారు. అధికారుల బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కూలిన శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తుండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. వెనిజులా దేశానికి భారత్ సహా పలు దేశాలు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. వెనెజులా దేశాన్ని వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ధాటికి దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి.రాజధాని కరాకస్ నగరంతో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాలలో వరుసగా రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై మొదట 7.1, ఆ వెంటనే 39 సెకన్ల వ్యవధిలోనే మరోసారి 7.5 తీవ్రతతో భూమి తీవ్రంగా కంపించింది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.