కర్ణాటకలోని మాండ్యా జిల్లా ముత్తాతిలో కావేరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి నలుగురు దుర్మరణం చెందారు. విహార యాత్రలో భాగంగా వచ్చిన ఓ కుటుంబం కబ్బాలమ్మ, ముత్తితిరాయ ఆలయాల్లో పూజలు ముగించుకుంది. అనంతరం కావేరి నదిలో స్నానానికి దిగింది. నది నీటి లోతును అంచనా వేయలేక విజయమ్మ (50), శ్వేత (38), ప్రియాంక (28), చైత్ర (20), మహేష్ (డ్రైవర్) నీట మునిగి..నదిలో కొట్టుకపోయారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ప్రాణ నష్టాన్ని పెంచేశాయి. అయితే అదృష్టవశాత్తు వారితో పాటు ఉన్న రవి, మరో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు.
మొదట ఫోటోల కోసం నదిలోకి దిగినవిజయమ్మ (50) గల్లంతైంది. విజయమ్మను రక్షించబోయి చైత్ర, శ్వేత, ప్రియాంక నీటిలో మునిగిపోయారు.నలుగురు మహిళలను కాపాడేందుకు వెళ్లి మహేశ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఏడుగురు నదిలోకి వెళ్లగా.. రవి అనే వ్యక్తితో పాటు మరో చిన్నారి మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. నీట మునిగిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🚨Tragedy in Karnataka
Five people, including four women, drowned in the Kaveri River near Muthathi, Mandya district.
Victims identified as: Chaitra (20), Priyanka (28), Shwetha (38), Vijayamma (50), and Mahesh.
They were from the same family visiting the area when strong…
— Being Political (@BeingPolitical1) June 25, 2026