స్టంట్స్ చేస్తూ.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి!

ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే పర్వతాలను ఎక్కుతూ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా పేరొందిన అల్-ఖాఖా స్టంట్లు చేసే క్రమంలో పట్టు తప్పి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Jun 13, 2026, 12:16 pm IST
Read Time: 2 mins
స్టంట్స్ చేస్తూ.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి!

ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే పర్వతాలను ఎక్కుతూ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా పేరొందిన అల్-ఖాఖా స్టంట్లు చేసే క్రమంలో పట్టు తప్పి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే సేఫ్టీ గేర్(ఎటువంటి రక్షణ కవచాలు) లేకుండా దామత్ అగ్నిపర్వత కొండలపై విన్యాసాలు చేస్తూ, ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు.

ఆయన కింద ఉన్న నీటి గుండంలో పడిపోగా.. ఆ నీరు విపరీతమైన వేడితో, లోతుగా ఉండటంతో ఇప్పటివరకు మృతదేహం లభ్యం కాలేదు. ఆల్ ఖాఖా మరణ వార్త ఆయన అభిమానులలో విషాదం రేపింది. ప్రమాదకర స్టంట్లలో సేఫ్టీ గేర్స్ పాటించాల్సి అవశ్యతను ఈ ఘటన గుర్తు చేస్తుందని నెటిజన్లు పేర్కొంటో..ఆల్ ఖాఖా మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.