కేన్ మామా గా పిలుచుకునే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. . 35 ఏళ్ల కేన్ కివీస్ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 19వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 48 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు (2016-24) న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. రెండుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్కు తన జట్టును చేర్చిన ఘటన విలయమ్సన్ సొంతం. అంతేకాదు విలియమ్సన్ కెప్టెన్సీలోనే న్యూజిలాండ్ తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం విశేషం. విరాట్ కోహ్లితో అండర్-19 క్రికెట్ నుంచి కేన్ విలయమ్సన్ మంచి సాన్నిహిత్యం నెలకొంది.
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేన్ విలియమన్స్ గతేడాది టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మిగతా రెండు ఫార్మాట్లకూ గుడ్బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్ పై విలిమ్సన్ స్పందించారు. ఆటకు వీడ్కోలు పలకడంపై గత కొన్ని రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నా. ఇదే సరైన సమయంగా భావిస్తున్నానన్నారు. అంతర్జాతీయ క్రికెట్ పట్ల నాకు ఎప్పుడూ బలమైన తపన, ఆసక్తి ఉండేవి. న్యూజిలాండ్ తరపున ఆడిన ప్రతి మ్యాచ్లోనూ నా పూర్తి సామర్ధ్యంతో ఆడానన్నారు. ఆ భావనే నన్ను గర్వపడేలా చేస్తోందని చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం ఆనందకరం అని, ఇన్నేళ్లూ జట్టులో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా అని కేన్ తెలిపాడు.
హైదరాబాదీలతో ‘కేన్ మామ’గా అనుబంధం
న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్ ను హైదరాబాదీ వాసులతో పాటు తెలుగు ప్రజలు కేన్ మామాగా పిలుచుకుంటూ ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్కు గతంలో కేన్ నాయకత్వం వహించిన సందర్బంతో ఎస్ఆర్హెచ్ ఫైనల్కూ చేరింది. ఆ తర్వాత 2016లో సన్ రైజర్స్ ఛాంపియన్గా అవతరించిన జట్టులోనూ కేన్ సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో 79 మ్యాచులు ఆడిన కేన్ 2,128 పరుగులు చేశాడు.