ఇవాళ లావెండర్‌లోకి మారిన గుజరాత్ టైటాన్స్‌ జెర్సీ.. ఎందుకో తెలుసా?

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ జెర్సీతో కనిపించడం వెనుక ఒక బలమైన సామాజిక సందేశం ఉంది. అలాగే RCB, RR, CSK, KKR, MI వంటి జట్లు కూడా ప్రత్యేక జెర్సీల ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి.

  • By: ADHARVA |    sports |    Published on : May 12, 2026 9:10 PM IST
ఇవాళ లావెండర్‌లోకి మారిన గుజరాత్ టైటాన్స్‌ జెర్సీ.. ఎందుకో తెలుసా? GT లావెండర్ జెర్సీ వెనుక ఉన్న అసలు కారణంపై అభిమానుల్లో ఆసక్తి

GT vs SRH: Why Gujarat Titans Changed Their Jersey Colour Today

విధాత క్రీడా విభాగం | మే 12, 2026 | హైదరాబాద్:

GT Jersey Change: ఐపీఎల్‌లో ప్రతి జట్టు తమ జెర్సీ రంగులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈమధ్య కొన్ని జట్లు ఒక రోజు తమ సాధారణ జెర్సీని పక్కనబెట్టి విభిన్నమైన జెర్సీని ధరించడం చూస్తున్నాం. మొన్నీమధ్య బెంగళూరు, రాజస్థాన్​ జట్టు ఇలాగే మార్చాయి. ఇవాళ గుజరాత్​ టైటాన్స్​ కూడా  సన్​రైజర్స్​ హైదరాబాద్​​తో జరుగుతున్న మ్యాచ్​లో  తమ సాంప్రదాయ డార్క్ బ్లూ జెర్సీని వదిలేసి ఒక్కసారిగా లావెండర్‌ కలర్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో “GT కొత్త జెర్సీ ఎందుకు?”, “స్పెషల్ థీమ్ ఏదైనా ఉందా?” అంటూ చర్చ మొదలైంది. అయితే దీని వెనుక ఉన్న కారణం కేవలం ఫ్యాషన్ కాదు.. ఒక బలమైన సామాజిక సందేశం.

క్యాన్సర్ అవగాహన కోసం ప్రత్యేక జెర్సీ

గుజరాత్ టైటాన్స్‌ ఈ లావెండర్ జెర్సీని క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ధరించింది. ప్రపంచవ్యాప్తంగా లావెండర్ రంగును క్యాన్సర్​ అవగాహనా కార్యక్రమాలకు ప్రతీకగా భావిస్తారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల అవసరాన్ని తెలియజేయడం, బాధితులకు మానసిక బలం ఇవ్వడం వంటి లక్ష్యాలతో GT ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను కొనసాగిస్తోంది.

ఇది ఈ ఒక్కరోజు కోసం చేసిన ప్రయోగం కాదు. గత కొన్ని సీజన్లుగా కూడా గుజరాత్​ ఇలాంటి ప్రత్యేక జెర్సీలతో సామాజిక బాధ్యతను గుర్తు చేస్తోంది. ఈసారి కూడా మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో లావెండర్ థీమ్‌తో ఫ్లాగ్స్‌, ఫ్యాన్ యాక్టివిటీస్‌, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం.

IPLలో జెర్సీలు ఇప్పుడు సామాజిక సందేశాల వేదిక

Gujarat Titans captain Shubman Gill wearing lavender jersey during GT vs SRH IPL 2026 match toss

క్యాన్సర్ అవగాహన సందేశంతో లావెండర్ జెర్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్‌లో ప్రత్యేక కారణాల కోసం జెర్సీ మార్పు కొత్త విషయం కాదు. పలు జట్లు ఇప్పటికే వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక జెర్సీలను ఉపయోగిస్తున్నాయి.

  • Royal Challengers Bengaluru – గ్రీన్ జెర్సీ
    పర్యావరణ పరిరక్షణ, “Go Green” సందేశం కోసం RCB ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌కు గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, పునర్వినియోగంపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం.
  • Rajasthan Royals – పింక్ జెర్సీ
    మహిళా సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతుగా రాజస్థాన్​ తమ గులాబీ జెర్సీని ఉపయోగిస్తోంది. జైపూర్ సంస్కృతికి ప్రతీకగా కూడా ఈ రంగును భావిస్తారు.
  • Chennai Super Kings – సైన్యానికి నివాళిగా జెర్సీ
    భారత సైన్యానికి గౌరవ సూచకంగా CSK గతంలో క్యామోఫ్లాజ్(ఊసరవెల్లి రంగులు) నమూనాతో ప్రత్యేక జెర్సీ ధరించింది. దేశభక్తి థీమ్‌తో అది అప్పట్లో పెద్ద చర్చగా మారింది.
  • Kolkata Knight Riders – ప్రత్యేక థీమ్ జెర్సీలు
    KKR కొన్ని సందర్భాల్లో వార్షికోత్సవాలు, ఫ్యాన్ ట్రిబ్యూట్స్‌, ప్రత్యేక సెలబ్రేషన్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక డిజైన్ జెర్సీలను తీసుకొచ్చింది.
  • Mumbai Indians – అవగాహన క్యాంపెయిన్ థీమ్‌లు
    ముంబై ఇండియన్స్ కూడా కొన్ని సీజన్లలో మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ప్రత్యేక థీమ్‌లను ప్రోత్సహించింది.

క్రికెట్‌కు మించి సామాజిక సందేశం

ఐపీఎల్ అనేది కేవలం వినోదం కాదు.. కోట్ల మందిపై ప్రభావం చూపే వేదిక. అలాంటి స్టేజ్‌ను ఉపయోగించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడం నిజంగా ప్రశంసనీయమే. GT తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. జెర్సీ రంగు మారినా.. జట్ల లక్ష్యం మాత్రం ఒకటే — “క్రీడల ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వడం.”