ఏనుగుల ఘర్షణ.. పర్యాటకురాలు మృతి
ఏనుగుల పోరాటం కాస్తా ఓ పర్యాటకురాలి మృతికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోఫల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద జరిగిన ఏనుగుల ఘర్షణ లో ఓ పర్యాటకురాలు ఏనుగు కింద పడి నలిగిపోయి మృతి చెందింది.
ఏనుగుల పోరాటం కాస్తా ఓ పర్యాటకురాలి మృతికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోఫల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద జరిగిన ఏనుగుల ఘర్షణ లో ఓ పర్యాటకురాలు ఏనుగు కింద పడి నలిగిపోయి మృతి చెందింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) తన కుటుంబంతో కలిసి సోమవారం కావేరి నది వద్దకు వచ్చింది.
ఆ సమయంలో మావటీలు స్నానానికి తెచ్చారు. పర్యాటకులు ఆ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తుండగా, ఉన్నట్టుండి రెండు ఏనుగుల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ రెండు ఏనుగులు పరస్పరం పోట్లాడుకోగా, ఒక ఏనుగు ప్రమాదవశాత్తు ఝాన్సీపై పడింది. ఏనుగు కింద నలిగిపోయిన ఝాన్సీ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాద సమయంలో ఆమె పక్కనే ఉన్న భర్త, కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కళ్ల ముందే భార్య మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన వన్యప్రాణుల శిబిరాల వద్ద పర్యాటకులు తగినంత దూరం పాటించాలని, ఏనుగుల వంటి భారీ జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏనుగు కింద పడి పర్యాటకురాలు మృతి..
కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద ఓ పర్యాటకురాలు ఏనుగు కింద నలిగి మృతి చెందింది.
తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) తన కుటుంబంతో కలిసి సోమవారం కావేరి నది వద్దకు వచ్చింది.
ఆ సమయంలో మావటీలు స్నానానికి… pic.twitter.com/IY6WIdEv1M— ChotaNews App (@ChotaNewsApp) May 19, 2026
ఇవి కూడా చదవండి :
జల మండలి జీఎం కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..రూ.100కోట్ల ఆస్తుల గుర్తింపు
Petrol | మళ్లీ పెట్రో బాదుడు.. లీటర్‌కు 90 పైసల చొప్పున పెంపు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram