ఫెన్సింగ్ లో చిక్కిన గజరాజు…ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్

మేత కోసం అభయారణ్యం బయటకు వెళ్లిన ఓ గజరాజు తిరిగి అడవిలోకి ప్రవేశించే క్రమంలో ఇనుప పట్టాలతో నిర్మించిన ఫెన్సింగ్(కంచె)లో చిక్కుకుని ఆర్తనాదాలు పెట్టిన ఘటన కర్ణాటకలోకి కావేరి అభయారణ్యంలో చోటుచేసుకుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 02, 2026, 12:33 pm IST
Read Time: 3 mins
ఫెన్సింగ్ లో చిక్కిన గజరాజు…ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్

విధాత, హైదరాబాద్ : మేత కోసం అభయారణ్యం బయటకు వెళ్లిన ఓ గజరాజు తిరిగి అడవిలోకి ప్రవేశించే క్రమంలో  ఇనుప పట్టాలతో నిర్మించిన ఫెన్సింగ్(కంచె)లో చిక్కుకుని ఆర్తనాదాలు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని కనకపుర సమీపంలోని ముగ్గూరు రేంజ్‌లో కావేరి వైల్డ్ లైఫ్ సాంచూరీలోకి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఓ అడవి ఏనుగు ఇనుప బ్యారికేడ్‌లో ఇరుక్కుపోయింది. అది ఫెన్సింగ్ ఇనుప కడ్డీల మధ్యలో చిక్కుకుని తన భారీ శరీరంలో బయటకు రాలేక ఆర్తనాదలు పెట్టింది. ఏనుగు ఘీంకార నాదాలు విన్న స్థానిక గిరిజనులు..దాని పరిస్థితిని గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు.

వారు సుమారు ఐదు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ముందుగా ఏనుగుకు మత్త ఇంజక్షన్ చేశారు. అది మత్తులోకి జారుకున్నాక ఇనుప పట్టాలను కత్తిరించేసి..ఏనుగు సురక్షితంగా లేచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు. గాయాలకు మందు పూసి..గ్లూకోజ్ లు సైతం ఎక్కించి అది శక్తి పుంజుకునేలా చేశారు. మత్తు నుంచి లేవగానే గజరాజు క్షేమంగా ఇనుప పట్టాల నుంచి బయడపడింది. వెంటనే అటవీశాఖ అధికారులు ఏనుగును సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపించారు.