Revanth Reddy| మూసీ అభివృద్ధికి అందరూ సహకరించండి : సీఎం రేవంత్ రెడ్డి
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దిని అడ్డుకోవద్దని , మూసీ అభివృద్దికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికైనా ఇబ్బంది వస్తే న్యాయం చేద్దాం, నష్ట పరిహారం ఇద్దాం అని, పేదలు ఇళ్లు కోల్పోతే ఇళ్లు ఇచ్చే విధంగా ముందుకెళ్దాం అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
విధాత, హైదరాబాద్ : మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దిని అడ్డుకోవద్దని , మూసీ అభివృద్దికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికైనా ఇబ్బంది వస్తే న్యాయం చేద్దాం, నష్ట పరిహారం ఇద్దాం అని, పేదలు ఇళ్లు కోల్పోతే ఇళ్లు ఇచ్చే విధంగా ముందుకెళ్దాం అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ను ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా తీర్చిదిద్దుకుందాం అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న 3 కమిషనరేట్ల పరిధిలో రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లై ఓవర్లు నిర్మించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం అని తెలిపారు. హైడ్రా పునరుద్ధరించిన కూకట్‌పల్లి నల్ల చెరువును ప్రారంభించి ఆయన మాట్లాడారు.
నల్ల చెరువు అభివృద్ధి చూస్తే ఆనందంగా ఉందని, గతంలో ఎంపీగా మీరు అశీర్వదించిన నేను ఈ రోజు సీఎంగా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది అన్నారు. ఆనాడు ఎంపీగా కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నా నిధులు లేక చేయలేకపోయానని ఇప్పుడు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాను అని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ వల్ల పేదలకు నష్టం కలిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలు ఉంటే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తాం. పేదవాడి ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ నదుల అభివృద్ధిని చేపట్టలేదా? మూసీ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడమంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ అభివృద్దితో ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. వరదల వల్ల ఇళ్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుందని, వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాల్సిన అనివార్యమని, మూసీని పునరుద్ధరించకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించబోవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నల్ల చెరువు అభివృద్ధిని చూసి అందరూ సంతోషిస్తున్నారు అని, ఎన్నికలప్పుడే రాజకీయాలు, తరువాత అభివృద్ధి, సంక్షేమమే నా విధానం అని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది నన్ను తిట్టుకున్నారు, విమర్శలు చేశారు అని, కానీ వాటిని మౌనంగా భరిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.20 కోట్ల వ్యయంతో 14 ఎకరాలు ఉన్న నల్ల చెరువును 30 ఎకరాలకు విస్తరించాం అని, చుట్టు పక్కల కాలనీలు మునిగిపోకుండా వర్షం నీరు చెరువులోకి వచ్చేలా ప్లాన్ చేశాం అని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram