BRS MLAs Defection Case : తుది అంకానికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ

బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ తుది దశకు చేరింది. కడియం శ్రీహరి కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించగా, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

BRS MLAs Defection Case : తుది అంకానికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ కు చెందిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణ ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగించారు. పిటిషనర్ ఎమ్మెల్యే వివేకానంద తరపు న్యాయవాదుల వాదనలు విన్నారు. వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇరుపక్షాల వాదనలను స్పీకర్ ప్రసాద్ నమోదు చేశారు. కడియం పార్టీ ఫిరాయింపుపై ఫిబ్రవరి 1 స్పీకర్ కు ఎమ్మెల్యే వివేకానంద మరిన్ని ఆధారాలు అందజేశారు. అంతకుముందు కడియం కూడా స్పీకర్ కు తాను సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా అఫిడవిట్ అందించారు.

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10మందికి సంబంధించి సుప్రీంకోర్టు విధించిన గడువు నేపథ్యంలో ఇఫ్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ 8మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‎పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ సహా బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరడం జరిగింది.
దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ జరిపి ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌, ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యల, సంజయ్ లపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. వారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నానని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చీట్ ఇచ్చారు.

మిగిలిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్లు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని వేర్వేరుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. గురువారం కడియం శ్రీహరి అనర్హత పిటిషనపై విచారణ కొనసాగించారు. దీంతో ఇంతకాలం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తుది దశకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి :

Telangana Thalli Funds : తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు
PM Modi : ఏఐ అవకాశం..ఆటంకం కాదు : ప్రధాని మోదీ