Gold Price | పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర మరోసారి పెరిగిపోగా...వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 930పెరిగి రూ. 1,63,310 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ. 3,00000 లక్షల వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Today

విధాత : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర మరోసారి పెరిగిపోగా…వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 930పెరిగి రూ. 1,63,310 వద్ద కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 1,49,700గా ఉంది. అయితే వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ. 3,00000 లక్షల వద్ద కొనసాగుతుంది.

మరింత పెరుగనున్న బంగారం ధర

పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న యుద్ద పరిస్థితుల మధ్య అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలతో పాటు బంగారం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెట్టుబడిదారులు రిస్క్ ఆస్తులను వదిలేసి సేఫ్ హెవన్ ఆస్తులపైకి పెట్టుబడులను మళ్లిస్తుండటంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పసిడి ధరలు పెరిగిపోతున్నాయి.

దుబాయ్ లో  బంగారంపై డిస్కౌంట్

అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దంతో పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీస్ లు నిలిచిపోవడంతో.. దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బంగారం ఎగుమతిలో ఆటంకాలు ఏర్పడటంతో ఆ దేశంలో బంగారం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో అక్కడ గోల్డ్ ధరలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వ్యాపారులకు స్టోరేజ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ భారంగా మారుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ధర కంటే దాదాపు 30 డాలర్ల వరకు తక్కువకే (డిస్కౌంట్) బంగారాన్ని విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు త‌గ్గాడా.. కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
Shiv Pratap Shukla| తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

Latest News