Gold Rates | హైదరాబాద్ : అంతర్జాతీయంగా బంగారానికి( Gold ) భారీ డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా – చైనా( America – China ) మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుండడంతో సురక్షిత పెట్టుబడిగా భావించి బంగారంపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ పసిడి పరుగులు పెడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ఒక్కరోజులోనే రూ. 1650 పెరిగి రూ. 98,100కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ. 1650 పెరిగి రూ. 97,650కి చేరింది. నిన్న సాయంత్రం 4.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700కు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో రూ.1900 మేర పెరిగి రూ.99,400కు చేరింది.
గత వారం రూ.90,000 కు చేరిన బంగారం ధర.. తాజాగా రూ.98,000 మార్క్‌ను టచ్ చేసింది. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భవిష్యత్‌లో బంగారం కొనలేమోనని ఆందోళన చెందుతున్నారు. డబ్బు ఉన్నవారు ఇప్పుడే కొనిపెట్టుకుంటే మంచిదని.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఉన్నారు.