విధాత: కొత్త ఏడాదిలో ఆల్ టైమ్ రికార్డు ధరల వైపు దూసుకపోతు కొనుగోలుదారులను హడలెత్తిస్తున్న వెండి, బంగారం ధరలు హాలిడే సండే(ఆదివారం) రోజున మాత్రం అనూహ్యంగా శాంతించి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగా ఉన్నాయి.
ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక గ్రాము వెండి ధర రూ.310 గా.. ఒక కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద కొనసాగుతుంది. ఇకపోతే బంగారం ధరలు సైతం నిన్నటి ధర వద్దనే ఆగిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఆదివారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,780వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,800వద్ద నిలిచింది.
ప్రస్తుతం నిలకడగా ఉన్న వెండి, బంగారం ధరలు మునుముందు మరింత పెరిగే అవకాశం ఉందని..వెండి కిలో రూ.3లక్షల 50వేలకు, పసిడి తులం రూ.1లక్ష 50వేల వరకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
