విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న పసిడి ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,310పెరిగి రూ. 1,58,350 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,200పెరిగి రూ 1,45,150వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 15,000 తగ్గి రూ. 2,85,000కు పడిపోయింది.
కొనసాగనున్న ధరల అస్థిరత
భారతదేశంలో వెండి దిగుమతులపై ప్రభుత్వం విధించిన తాజా ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కదలికలు, అమెరికా-ఇరాన్ వివాదం చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో.. రాబోయే మరికొన్ని రోజులు బంగారం, వెండి ధరలు తీవ్ర అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జేఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ విశ్లేషణ ప్రకారం.. భారత్, చైనా, అమెరికా వంటి ప్రధాన దేశాల నుండి ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా రావడంతో, ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు ఉండవనే అంచనాలు బలపడి అంతర్జాతీయంగా బంగారం ధరలు నెమ్మదించాయి. దీనికి తోడు భారత్ లో బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షల నిర్ణయాలు కూడా అంతర్జాతీయ బులియన్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి.
అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, కాల్పుల విరమణ అమలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధం ఇంకా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వారానికి ఎనిమిది నుండి పది శాతం చొప్పున పెరుగుతూ, బ్యారెల్‌కు వంద డాలర్లకు పైగా స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశీయ బులియన్ ధరలను ప్రభావితం చేసే కీలక అంశంగా రూపాయి కదలికలు నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Jr NTR | ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ లైనప్ ఇదేనా.. వరుసగా నాలుగు భారీ ప్రాజెక్ట్‌లు …!
NTR | హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్: హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. ఎన్టీఆర్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు!
