విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద పరిణామాల నేపథ్యంలో కొన్ని రోజులుగా వరుస పతనాన్ని నమోదు చేసిన బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,510 పెరిగి రూ.1,48,090వద్ద కొనాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,300పెరిగి రూ. 1,35,750కి చేరింది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 పెరిగి రూ. 2,50,00కు చేరింది.
. ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పసిడి మీదకు మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. రిస్క్ ఆస్తులను వదిలేయడంతో ఇన్వెస్టర్లకు సేఫ్ హెవెన్ గా బంగారం మాత్రమే కనిపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే రూపాయి విలువ కుప్పకూలడం, డాలర్ బలం పుంజుకోవడంతో కూడా పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే క్రమంలో బంగారం, వెండి ధరలు పెరుగుదలన నమోదు చేస్తున్నట్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy : ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Royal Enfiled Guerilla 450 | రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!
