అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra!

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అద్భుతమైన వార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) 2026లో భాగంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ S25 Ultra భారీ తగ్గింపు ధరలో వస్తుంది.

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అద్భుతమైన వార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) 2026లో భాగంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ S25 Ultra భారీ తగ్గింపు ధరలో వస్తుంది. సాధారణంగా లక్షకుపైగా ధర ఉండే ఈ మొబైల్‌ను అన్ని ఆఫర్లు కలుపుకుని రూ.94,999కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S25 Ultra మొబైల్‌ను శాంసంగ్ కంపెనీ జనవరి 2025లో విడుదల చేసింది. దాని తర్వాత చాలా మోడళ్లు వచ్చినప్పటికీ ఈ ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కెమెరా, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో బెస్ట్ ప్రీమియం ఫోన్లలో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ మొబైల్ (12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.1,29,999 కాగా, అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌లో దీనిపై 23 శాతం తగ్గింపు ప్రకటించారు. దీంతో ఈ మొబైల్ ధర రూ.99,999కి తగ్గింది.

దీనికి అదనంగా అమెజాన్ పేజీలో అందుబాటులో ఉన్న రూ.2000 డిస్కౌంట్ కూపన్ అప్లై చేస్తే రూ.97,999కే వస్తుంది. ఇంకా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేల వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్లను కలిపితే ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను కేవలం రూ.94,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్‌పై ఇంత అత్యల్ప ధర ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఫీచర్ల విషయానికి వస్తే Samsung Galaxy S25 Ultra 6.9 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే‌తో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్‌ను అందించారు. ఈ మొబైల్ Android 15 ఆధారిత OneUI7తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన పనితీరు అందిస్తుంది. ఇది 12జీబీ ర్యామ్‌తో పాటు 1టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది.

కెమెరా విషయానికి వస్తే ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50మెగాపిక్సెల్ టెలిఫొటో, 10మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. అధిక నాణ్యత ఫొటోలు, జూమ్ ఫొటోగ్రఫీ, 4K వీడియో రికార్డింగ్‌కు ఈ మొబైల్ అనుకూలంగా ఉంటుంది. సెల్ఫీల కోసం 12మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

Read More:

రూ.10వేలలోనే ఐటెల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

వివో నుంచి X300 Ultra, X300 FE లాంచ్.. ధర ఎంతంటే..!

Latest News