Itel Zeno 200 | రూ.10వేలలోనే ఐటెల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
Itel Zeno 200 | ఐటెల్ కంపెనీ భారత మార్కెట్‌లో సరికొత్త బడ్జెట్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఐటెల్ జెనో 200 మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన జెనో 100 మోడల్‌కు కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ ఫోన్ తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తోంది.
Itel Zeno 200 | ఐటెల్ కంపెనీ భారత మార్కెట్‌లో సరికొత్త బడ్జెట్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఐటెల్ జెనో 200 మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన జెనో 100 మోడల్‌కు కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ ఫోన్ తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తోంది.
ధర ఎంతంటే..!
ఇటెల్ జెనో 200 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక్క వేరియంట్‌ను మాత్రమే భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ మోడల్ ధరను రూ.10,399గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.549 వరకు తగ్గింపు కూడా లభిస్తోంది.
ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. కామెట్ ఆరెంజ్, మీటియర్ టైటానియం, నైట్‌లీ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్లు
ఐటెల్ జెనో 200 మొబైల్‌లో 6.75 అంగుళాల హెడ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 720*1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను అందిస్తోంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 590 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా అందించారు. దీంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుందని ఐటెల్ కంపెనీ తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Octa Core Unisoc ప్రాసెసర్‌ను అమర్చారు. 12nm ప్రాసెస్‌పై రూపొందించిన ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 1.8Ghz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. 4GB LPDDR4x ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 Go ఎడిషన్‌పై పనిచేస్తుంది.
కెమెరా స్పెసిఫికేషన్లు
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 13మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీనికి f/1.85అపర్చర్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్‌ను కూడా జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది.
ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 28 గంటల టాక్‌టైమ్
ఇటెల్ జెనో 200లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే 46 రోజుల స్టాండ్‌బై టైమ్, 30 గంటలకు పైగా మ్యూజిక్ ప్లే బ్యాక్, 28 గంటల టాక్‌టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
మరిన్ని ఫీచర్లు
ఈ ఫోన్‌లో అదనంగా IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు MIL STD 810H సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం విశేషం. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, 4G LTE, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, USB టైప్-C పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 185 గ్రాములు కాగా, మందం 8.29 మిల్లీమీటర్లు మాత్రమే కావడం విశేషం.
Read More:
వివో నుంచి X300 Ultra, X300 FE లాంచ్.. ధర ఎంతంటే..!
హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram