Huawei Nova 16 | హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు
Huawei Nova 16 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గం హువావే త్వరలోనే నోవా నోవా సిరీస్ నుంచి కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన నోవా 15 సిరీస్‌కు అప్‌డేట్‌గా తీసుకొస్తున్న ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పుడు బయటకొచ్చాయి.
Huawei Nova 16 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గం హువావే త్వరలోనే నోవా నోవా సిరీస్ నుంచి కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో నోవా 15 సిరీస్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి అప్‌డేట్‌గా తీసుకొస్తున్న ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పుడు బయటకొచ్చాయి.
తాజా లీకుల ప్రకారం నోవా 16, నోవా 16 ప్రో, నోవా 16 ప్రో మ్యాక్స్ అనే మూడు మోడల్స్ మాత్రమే రానున్నాయి. ఇందులో 16 ప్రో మ్యాక్స్ మోడల్ అత్యంత పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇక ఈసారి నోవా 16 సిరీస్‌లో అల్ట్రా వేరియంట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే నోవా 16, నోవా 16 ప్రో మోడళ్లు బ్లాక్, వైట్, బ్లూ, గ్రేడియంట్ ఫినిష్‌లో అందుబాటులోకి రానున్నాయి. నోవా 16 ప్రో మ్యాక్స్ మాత్రం బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో మాత్రమే లభించనుంది.
పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఈ సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లతో రానుంది. గత నోవా 15 సిరీస్‌లో కిరిన్ 9010S, కిరిన్ 8020 ప్రాసెసర్లను వాడారు. కాగా ఈసారి కొత్త నోవా 16 సిరీస్‌లో మరింత శక్తివంతమైన కిరిన్ 9 సిరీస్ అనే చిప్‌సెట్ వాడుతున్నారు.
నోవా 16సిరీస్‌లో బ్యాటరీ కెపాసిటీనే ముఖ్యమైన హైలైట్‌గా చెప్పొచ్చు. హైఎండ్ మోడల్స్‌లో 7000mAh వరకు బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ నోవా 16 మోడల్‌లో 6000mAh బ్యారటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
నోవా 15 అల్ట్రా, ప్రో మోడల్స్‌లో 6.54 అంగుళాల డిస్‌ప్లేను ఇచ్చారు. ఈసారి నోవా 16ప్రో మ్యాక్స్‌లో దానికంటే పెద్ద స్క్రీన్ ఇవ్వవచ్చని అంచనా. ఇక ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్ వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. గత మోడల్‌లో 50మెగాపిక్సెల్ కెమెరాలు అందించిన హువావే.. ఈసారి మరింత మెరుగైన కెమెరా టెక్నాలజీని అందించే అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరా కూడా హై రిజల్యూషన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ హార్మోనీ ఓఎస్(Haromony OS) కొత్త వెర్షన్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై హువావే నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ఏడాది డిసెంబర్ సమయానికి ఈ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More:
త్వరలోనే రియల్‌మీ నుంచి కొత్త మొబైల్.. గత మోడల్‌తో పోలిస్తే పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram