Royal Enfiled Guerilla 450 | రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్‌ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!

Royal Enfiled Guerilla 450 | ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా 2026 గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450)ను అధికారికంగా విడుదల చేసింది.

Royal Enfiled Guerilla 450 | ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా 2026 గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450)ను అధికారికంగా విడుదల చేసింది. గువాహటిలో జరిగిన GRRR Nights ఫెస్టివల్‌లో ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కొత్తగా APEX వేరియంట్‌ను కూడా పరిచయం చేయడం విశేషం. కాగా, Sherpa ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ 1.25 లక్షల బైక్‌ల ఉత్పత్తి పూర్తి చేసిన సందర్భంగా ఈ లాంచ్ ఈవెంట్ మరింత ప్రాధాన్యం సొంతం చేసుకుంది.

ఇక కొత్త అపెక్స్ వేరియంట్ గెరిల్లా 450లో మరింత స్పోర్టీ, స్ట్రీట్ ఫోకస్‌ మోడల్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ రూపొందించింది. ఈ మోడల్‌లో హ్యాండిల్‌బార్‌ను కొద్దిగా దిగవకు మార్చి, ముందుకు వంగినట్లుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ను అందించారు. దీనివల్ల రైడింగ్ చేసిన మరింత అగ్రెసివ్ ఫీల్ కలగనుంది.

టైర్ల విషయంలోనూ ఇందులో పలు మార్పులు తీసుకొచ్చింది. 17 అంగుళాల Vredestein Centuro ST టైర్లను అమర్చారు. దీనివల్ల ఎటువంటి వాతావరణంలో అయినా సరే రోడ్లపై మెరుగైన గ్రిప్ కంట్రోల్ లభిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తెలిపింది.

డిజైన్‌పరంగా కూడా అపెక్స్ వేరియంట్‌ ఆకట్టుకుంటుంది. రియర్ సీట్ కౌల్, కలర్ కోడ్ చేసిన ఫ్రంట్ కౌల్, రిమ్ టేప్స్ వంటి ఎలిమెంట్లు బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఈ వేరియంట్ అపెక్స్ రెడ్, అపెక్స్ బ్లాక్, అపెక్స్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే ఉన్న Dash, Flash వేరియంట్లలోనూ అప్‌డేట్స్ తీసుకొచ్చారు. ఈ మోడళ్లలో CEAT GRIPP XL RE టైర్లను అమర్చారు. దీనివల్ల వెట్ కండీషన్లలోనూ మెరుగైన పనితీరు ఉంటుంది.

గెరిల్లా 450 మోడల్‌లోని అన్ని వేరియంట్లలోనూ కొత్తగా Ride Mode Retention అనే సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకొచ్చింది. ఇది రైడర్ చివరగా ఎంచుకున్న Street లేదా Sports మోడ్‌ను గుర్తుంచుకుంటుంది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి తర్వాత కూడా అదే మోడ్‌ను కొనసాగిస్తుంది. ఇక Dash వేరియంట్‌లో Twilight Blue అనే కొత్త కలర్ ఆప్షన్ కూడా జోడించారు.

రెండు వేరియంట్లు మూడు ట్రిమ్‌ల్లో అందుబాటులో ఉండగా.. ప్రారంభ ధరను రూ.2.49 లక్షలు ( ఎక్స్‌ షోరూం చెన్నై)గా నిర్ణయించారు. వేరియంట్‌ను బట్టి ధరలు సుమారు రూ.2.72 లక్షల వరకు ఉన్నాయి.

టెక్నికల్ స్పెసిఫికేషన్లు

టెక్నికల్ పరంగా గెరిల్లా 450 మోడల్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇది 450 CC Sherpa సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. 40PS పవర్, 40nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టీల్ ట్వి్న్ – స్పార్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌లో 4 అంగుళాల TFT ట్రిప్పర్ డ్యాష్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి ఫీచర్లను జోడించింది.

ఈ సందర్భంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ.. Muay Thai బ్రాండ్ అయిన Fairtexతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో లిమిటెడ్ ఎడిషన్ గేర్ (గ్లోవ్స్, షార్ట్స్, టీషర్ట్స్)తో పాటు APEX ఆధారంగా కస్టమ్ బైక్స్‌ను విడుదల చేయనున్నారు.

125 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఈ బైక్‌ను పరిమిత కాలానికి ప్రత్యేక ధరలో అందిస్తోంది. మార్చి 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 31వ తేదీ నుంచి టెస్ట్ రైడ్స్, రిటైల్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. . కొత్త ఫీచర్లు, స్పోర్టీ డిజైన్, మెరుగైన రైడింగ్ అనుభవంతో వస్తున్న 2026 గెరిల్లా 450 మార్కెట్‌లో బలమైన పోటీ ఇవ్వనుందని నిపుణులు భావిస్తున్నారు.

Read More:

Royal Enfield Hunter 350 | శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

Latest News