Site icon vidhaatha

2K Notes | మీదగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా..? మరి ఎలా మార్చుకోవచ్చో తెలుసా..?

2K Notes | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. గతేడాది మే 19న నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, చెలామణిలో ఉన్న రూ.3.56లక్షల కోట్లను మార్చుకునేందుకు 2023 సెప్టెంబర్‌ వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత గడువునూ పొడిగిస్తూ వచ్చింది. ఆర్‌బీఐ అంచనాల మేరకు.. ఇంకా రూ.7వేలకోట్లకుపైగానే రూ.2వేలనోట్లు తిరిగి చేరాల్సి ఉంది. ఇప్పటి వరకు 98శాతం వరకు రూ.2వేల నోట్లు ఆర్‌బీఐకి తిరిగి చేరాయి. ఇంకా అక్షరాలా రూ.7,117కోట్లు రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం రూ.2వేల నోట్స్‌ మార్పిడి మందగించింది. జూలై 1 నాటికి మార్కెట్‌లో రూ.7,581 కోట్ల విలువైన రూ.2వేలకోట్ల నోట్లు ఉండిపోగా.. సెప్టెంబర్ ఒకటి వరకు రూ.7వేలకోట్లు రావాల్సి ఉంది.

రెండునెలల్లో 320కోట్ల రూ.2వేలకోట్ల నోట్లు వెనక్కి వచ్చాయి. 2023లో చెలామణిలో 3.56లక్షల కోట్ల నోట్లు ఉండగా.. అదే ఏడాది డిసెంబర్‌ నాటికి 9,330 కోట్లకు చేరింది. ఆర్‌బీఐ క్లీన్‌ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకున్నది. మొదట బ్యాంకులు, పోస్టాఫీస్‌లు, ఆర్‌బీఐ రీజనల్‌ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇంకా నోట్లను మార్చుకునేందుకు సైతం వీలు కల్పిస్తున్నది. బ్యాంకులు జమ చేసేందుకు మాత్రం అవకాశం లేదు. కేవలం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ రీజనల్‌ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉన్నది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్‌, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్న రీజనల్‌ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.

Exit mobile version