WhatsApp | వాట్సాప్‌ వాడుతున్నారా..? ఈ రెండు ఫీచర్స్‌ ఎలా వాడాలో తెలుసా..?

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లలో యూజర్లున్నారు. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తుంది. తాజాగా కొత్త రెండు ఫీచర్స్‌ని తీసుకువచ్చింది. అయితే, ఫీచర్స్‌ని ఎలా వాడాలో చాలా మందికి అవగాహన లేదు. ఈ ఫీచర్లలో ఒకటి ‘సీక్రెట్‌ చాటింగ్‌’కు సంబంధించింది కాగా.. మరొకటి యూజర్ల అనుభూతిని మరింత పెంచుతున్నది.

  • Publish Date - May 13, 2024 / 10:10 AM IST

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లలో యూజర్లున్నారు. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తుంది. తాజాగా కొత్త రెండు ఫీచర్స్‌ని తీసుకువచ్చింది. అయితే, ఫీచర్స్‌ని ఎలా వాడాలో చాలా మందికి అవగాహన లేదు. ఈ ఫీచర్లలో ఒకటి ‘సీక్రెట్‌ చాటింగ్‌’కు సంబంధించింది కాగా.. మరొకటి యూజర్ల అనుభూతిని మరింత పెంచుతున్నది. వాస్తవానికి చాలా మంది యూజర్లు తమ చాట్స్‌ ఇతరులు చూడకూడదని భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే వాట్సాప్‌ ‘చాట్‌లాక్‌’ ఫీచర్‌ని పరిచయం చేసింది. ఈ ఫీచర్స్‌ సహాయంతో యూజర్లు చాట్స్‌ని సీక్రెట్‌గా దాచే అవకాశం ఉంటుంది. దానికి పాస్వర్డ్‌ ఉంటుంది కాబట్టి ఎవరూ యాక్సెస్‌ చేసేందుకు వీలుండదు.

చాట్‌లాక్‌ ఫీచర్‌ని ఎలా వాడాలంటే..

మొదట ఎవరితో జరిపిన చాట్స్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. కాంటాక్ట్ మీద ట్యాప్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్‌లాక్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ఆన్‌ చేస్తే సరిపోతుంది. ‘చాట్‌లాక్’ ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా యాప్‌లో లాక్ అయిపోతుంది. తిరిగి ఆ చాట్‌ను చదవాలనుకుంటే వాట్సాప్‌పైన లాక్డ్‌చాట్స్‌ అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే పాస్వర్డ్‌ ఎంటర్‌ చేస్తే కనిపిస్తాయి. లాక్ చేసిన చాట్‌ను కూడా పూర్తిగా ఎవరికీ కనిపించకుండా దాచడానికి కూడా కొత్త హైడ్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకువచ్చింది.

చాట్స్‌ని హైడ్‌ చేయడం ఎలా..

ఈ చాట్‌హైడ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకునేందుకు తొలుత కాంటాక్ట్‌ను చాట్‌లాక్‌ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌ హోంపేజీలో చాట్స్‌పై భాగం లాక్‌చాట్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి లాక్డ్ చాట్స్ విభాగంలో ఎగువ కుడి వైపున మూడుచుక్కలు కనిపిస్తుంటాయి. ఈ చుక్కలపై ట్యాప్ చేస్తే చాట్‌ లాక్ సెట్టింగ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ‘హైడ్ లాక్డ్ చాట్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఎనేబుల్ చేయగానే సీక్రెట్ కోడ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సీక్రెడ్ కోడ్‌ని ఎంటర్ చేయాలి. అక్కడ కనిపించే స్టెప్స్‌ని అనుసరిస్తే హోమ్ పేజీలో ‘లాక్డ్ చాట్స్’ ఆప్షన్ కనిపించదు. లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేయడానికి చాట్ లాక్ సెట్టింగ్‌లో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా చాట్స్ ప్రత్యక్షమవుతాయి.

Latest News