Jio new plan : జియో కస్టమర్లకు ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ శుభవార్త చెప్పారు. కేవలం రూ.299 కే ఏడాదంతా సర్వీసు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇంత తక్కువ ధరకే జియో రీచార్జ్ ప్లాన్ తీసుకురావడం సంచలనంగా మారింది. ఇంతకు అంబానీ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఏమిటి..? అది ఏ కస్టమర్లకు వర్తిస్తుంది..? ఈ కొత్త ప్లాన్ అందించే సర్వీసులు ఏమిటి..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటికే టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న జియో.. ఓటీటీ రంగంలో కూడా దూసుకుపోవాలని భావిస్తున్నది. అందుకోసం తన పాత స్ట్రాటజీనే వినియోగిస్తున్నది. జియో టెలికామ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత సిమ్ములు, తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ ప్యాక్‌లను తీసుకువచ్చి.. అప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్, వోడాఫోన్‌లకు కోలుకోలేని షాకిచ్చింది.
జియో దెబ్బకు మిగతా టెలికామ్ కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు. దాంతో కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులోకి వచ్చింది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఓటీటీల రంగంలో కూడా అమలు చేయడానికి జియో రెడీ అవుతోంది. ఇప్పటికే ఓటీటీ రంగంలో ముందు వరుసలో ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ముకేశ్ అంబానీ సరికొత్త ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా రిలయన్స్ జియో తన ఓటీటీ వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ ప్రీమియం యాన్యువల్ పేరుతో కొత్త యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇక ఈ ప్లాన్ వార్షిక ధర కేవలం రూ.299 మాత్రమే. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వార్షిక ప్లాన్‌లకు వేలకు వేలు ఖర్చవుతుండగా ముకేశ్ అంబానీ కేవలం రూ.299కి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా వార్షిక ప్లాన్‌ను ప్రారంభించబోతున్నారు.
జియో తీసుకురాబోయే కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్‌తో మీరు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను చూడవచ్చు. మొబైల్ యాప్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌లో కనెక్ట్ చేయబడిన టీవీతో సహా ఏదైనా గాడ్జెట్‌లో ప్రత్యేకమైన సిరీస్‌లు, చలనచిత్రాలు, హాలీవుడ్ కంటెంట్, పిల్లల షోలు, టీవీ కార్యక్రమాలు చూసే సదుపాయం ఉన్నది.