Mukesh Ambani Tops Forbes List | ఫోర్బ్స్ సంపన్నుల జాబితా: 100 మంది కుబేరుల జాబితాలో టాప్ లో ముఖేష్ అంబానీ

భారత్‌లోని 100 మంది కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ₹105 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా, ₹92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు.

Mukesh Ambani tops Forbes list

భారత్ లోని 100 మంది కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఇండియాలోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ గురువారం విడుదల చేసింది. ఆయన సంపద 105 బిలియన్ డాలర్లు.
ముఖేష్ అంబానీ గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. టెలికం, ఇంధనం, రిటైల్, టెక్నాలజీ వరకు అంబానీ తన వ్యాపారాన్ని విస్తరించారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో కూడా రిలయన్స్ ప్రవేశించింది. ముఖేష్ అంబానీ తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద విలువ 92 బిలియన్ డాలర్లు. అదానీపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ప్రభావం చూపాయి. అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. 40.2 బిలియన్ డాలర్లతో ఇక మూడో స్థానంలోసావిత్ర జిందాల్ నిలిచారు. అయితే గత ఏడాదితో పోలిస్తే జిందాల్ సంపద 3.5 బిలియన్ డాలర్లు పడిపోయింది.అయినా కూడా ఆమె భారత్ లో సంపన్నురాలైన మహిళగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

నాలుగో స్థానంలో టెలికం ధిగ్గజం సునీల్ మిట్టల్ ఉన్నారు. గతంతో పోలిస్తే మిట్టల్ సంపదలో మూడు స్థానాలు పైకి ఎగబాకారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మిట్టర్ సంపద 34.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 3.5 బిలియన్ డాలర్లు ఆయన సంపదకు తోడైంది. 2008లో ఆయన ఈ స్థానంలో కొనసాగారు. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకులు శివ నాడార్ రూ. 33.2 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఒక్క స్థానాన్ని కోల్పోయారు. డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 28.2 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మాసూటికల్స్ కు చెందిన దిలీప్ సంఘ్వి ఏడో స్థానంలో నిలిచారు.ఆయన సంపద విలువ 26.3 బిలియన్ డాలర్లు. బజాజ్ ఫ్యామిలీ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ సంస్థ సంపద 21.8 బిలియన్ డాలర్లు. సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 21.4 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అధినేత కుమార్ బిర్లా 20.7 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు. హిందూజా ఫ్యామిలీ 20.6 బిలియన్ డాలర్లతో 11 స్థానంలో నిలిచింది.

స్టాక్ ఎక్చేంజ్ లు,ఆయా వ్యక్తులు, కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసినట్టు ఫోర్బ్జ్ ప్రకటించింది.