Site icon vidhaatha

Hyderabad: జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా.. టైటానియాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్

హైదరాబాద్: జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రధాన ప్రాజెక్ట్ టైటానియాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) పొందినట్లు ప్రకటించింది. ఐటీ కారిడార్ కొండాపూర్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఐటీ హబ్‌లు, విద్యా సంస్థలు, ఆరోగ్య, వినోద కేంద్రాలకు అనుసంధానంతో పాటు ఆలోచనాత్మక డిజైన్, స్థిరత్వంపై దృష్టి సారించడంతో ప్రత్యేకంగా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కంపెనీ సీఈవో కార్తీష్ రెడ్డి మద్గుల మాట్లాడుతూ.. “టైటానియాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం గృహ కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన, స్థిరమైన, ఆచరణీయమైన ఇళ్లను అందించాలనే మా లక్ష్యంలో కీలక ముందడుగు. అత్యున్నత నాణ్యతతో స్థలాలను నిర్మించడమే కాకుండా, సాంకేతికత, పర్యావరణ అనుకూల పరిష్కారాలతో దీర్ఘకాలిక విలువను జోడించి జీవన అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. టైటానియాలో నివాసితులు తమ ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ ఆకాంక్షలను తీర్చే నివాసాలను పొందుతారని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు.

Exit mobile version