Site icon vidhaatha

Realme C65 5G | రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌..! ధర అస్సలు ఊహించి ఉండరు..!

Realme C65 5G | భారతదేశ మార్కెట్‌లో బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్స్‌కు భారీగానే డిమాండ్‌ ఉన్నది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కంపెనీలు పలు కొత్త కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా రియల్‌మీ కంపెనీ సైతం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మోడల్‌కు రియల్‌మీ సీ65 పేరుపెట్టినట్లు తెలుస్తుంది. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో మొబైల్‌కు సంబంధించి వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఈ మోడల్‌ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మోడల్‌ పేరును సీ65గా నామకరణం చేశారని.. ఇది 6జీబీ ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తున్నది. 91మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం.. ఈ మొబైల్‌ కేవలం రూ.10వేలలోపు ఉండవచ్చని సమాచారం. అదనంగా 6 జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్​ ఉండవచ్చని తెలుస్తున్నది.

ఈ మొబైల్‌ను వియత్నాంలో ఏప్రిల్‌ 4న సీ65 లాంచ్‌ చేయనున్నది. ప్రస్తుతం ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు హాట్‌టాపిక్‌గా మారింది. సమాచారం మేరకు.. రియల్​మీ సీ65లో 6.67 ఇంచ్​ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్​నెస్‌తో రానున్నది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్​సెట్​పై ఆధారపడి పని చేయనుండగా.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉండనున్నట్లు తెలుస్తున్నది. రియల్​మీ సీ65 డ్యూయెల్ రియర్‌ కెమెరా సెటప్​తో పాటు ఫ్లిక్కర్ సెన్సార్‌ను ఉండే అవకాశం ఉండగా. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఛాన్స్‌ ఉన్నది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రానున్నది. వాటర్​- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ పొందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రియల్‌మీ సీ65 గ్లోబల్‌ లాంచ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. స్పెసిఫికేషన్స్‌పై సైతం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రూమర్స్‌ మాత్రమే. ఇప్పటి వరకు సంస్థ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

Exit mobile version