విధాత : భారత్ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు గురయ్యాయి. ఒక్క రోజులోనే మదుపరుల రూ.9లక్షల కోట్ల సందప ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1,065పాయింట్ల నష్టంతో 82,180వద్ద ముగిసిపోగా, నిఫ్టీ 353పాయింట్ల నష్టంతో 25,232పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.97గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. ఎటెర్నల్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఇండిగో, ట్రెంట్ ప్రధానంగా నష్టాలకు లోనయ్యాయి.
ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మన సూచీలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 1200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ కూడా 25,200 దిగువకు చేరింది. తర్వాత కాస్త కోలుకున్నాయి. ఈ క్రమంలోనే సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి :
Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
Delhi Metro : షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు
