Site icon vidhaatha

Somashila Tour | శ్రీశైలం, సోమశిల అందాలను చూసొద్దామా..? తెలంగాణ టూరిజం స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ..!

Somashila Tour | వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే సెలవులు ముగిసిన మళ్లీ స్కూల్స్ మొదలవనున్నాయి. కుటుంబంతో ఎక్కడైనా వెకేషన్‌కు వెళ్దామని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రెండురోజుల పర్యటన కొనసాగుతుంది. తక్కువ బడ్జెట్‌లోనే ‘హైదరాబాద్‌-శ్రీశైలం-సోమశిలా-హైదరాబాద్‌’ పేరుతో తెలంగాణ టూరిజం తీసుకువచ్చింది. ప్రతీ శనివారం ఉదయం ఈ టూర్‌ అందుబాటులో ఉంటుంది. రివర్‌ క్రూయిజ్‌లో ప్రయాణం ఈ టూర్‌ ప్రత్యేక అనుభూతిని ఇవ్వనున్నది. శ్రీశైలంతో పాటు సోమశిల ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం కలుగనున్నది.

టూర్‌, ప్యాకేజీ వివరాలు..

తొలిరోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌ సీఆర్‌వో కార్యాలయం నుంచి నాన్‌ ఏసీ బస్సు శ్రీశైలం బయలుదేరుతుంది. సాయంత్రానికి శ్రీశైలం చేరుకొని హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం భ్రమరాంబ సమేల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. రెండో ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు బోట్‌లో ప్రయాణం ఉంటుంది. అనంతరం మళ్లీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరుగుప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.4,499గా ధర నిర్ణయించారు. పిల్లలకు రూ.3,600 చెల్లించాల్సి ఉంటుంది. నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. శ్రీశైలంలో నాన్‌ ఏసీ వసతి, నాన్‌ ఏసీ బోట్‌ చార్జీలు, బోటులో వెజ్‌ మీల్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఈ 9848540371 నంబర్‌లో సంప్రదించాలని తెలంగాణ టూరిజం కోరింది.

Exit mobile version