WhatsApp | యూజర్లే ఫొటోలు క్రియేట్‌ చేసుకునేలా..! ఏఐ ‘ఇమాజిన్‌’ ఫీచర్‌ తీసుకువస్తున్న వాట్సాప్‌..!

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను పరిచయం చేసిన మెటా యాజమాన్యంలో వాట్సాప్‌.. ఏఐ సాంకేతిక వ్యవస్థలో మరో ముందడుగు వేసింది. యూజర్లు తమకు నచ్చినట్లుగా ఫొటోలను క్రియేట్‌ చేసుకునేలా ఏఐ ఆధారిత ‘ఇమాజిన్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకురాబోతున్నది.

  • Publish Date - June 1, 2024 / 10:00 AM IST

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను పరిచయం చేసిన మెటా యాజమాన్యంలో వాట్సాప్‌.. ఏఐ సాంకేతిక వ్యవస్థలో మరో ముందడుగు వేసింది. యూజర్లు తమకు నచ్చినట్లుగా ఫొటోలను క్రియేట్‌ చేసుకునేలా ఏఐ ఆధారిత ‘ఇమాజిన్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉందని.. వాట్సాప్‌ ట్రాకర్‌ ‘వాట్సప్‌‌బీటా ఇన్ఫో’ (WABetaInfo) వెల్లడించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.12.4లో ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని.. త్వరలోనే యూజర్లు అందరికీ అందుబాటులోకి రాబోతుందని పేర్కొంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే టెక్స్‌ట్‌ నుంచి నుంచి సైతం ఫొటోలను రూపొందించవచ్చని ‘వాట్సప్‌బీటా ఇన్ఫో’ రిపోర్ట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ సైతం బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఏఐ ఇమాజిన్ ఫీచర్‌‌ అటాచ్‌మెంట్ ఆప్షన్లలో కనిపిస్తుంది. అటాచ్‌మెంట్ ఆప్షన్స్‌లో ఇమాజిన్‌పై టాప్ చేసి.. కావాల్సిన విధంగా ఏఐ ఫొటోలను సులభంగా తయారు చేసుకోవచ్చని చెప్పింది. ఇక గ్రూప్ చాట్‌లో @Meta AI అని ట్యాగ్ చేసి ఈ ఫీచర్‌ యాక్సెస్‌ని పొందవచ్చు. ఈ ఫీచర్ తొలుత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నది. అయితే, భారత్‌లో ఈ ఫీచర్స్‌ను ఎప్పుడు తీసుకువస్తుందనేది తెలియరాలేదు.

Latest News