Site icon vidhaatha

Chiranjeevi| ‘విశ్వంభర’ ఆలస్యం అందుకే: చిరంజీవి వివరణ

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్(Socio Fantasy Film) ‘విశ్వంభర’ (Vishwambhara)విడుదల ఎప్పుడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల(Release) ఆలస్యానికి కారణాలను(Delay Reason)వెల్లడిస్తూ..సినిమా విడుదల సమయంపై చిరంజీవి స్వయంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఎఫ్ ఎక్స్VFX గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉందని..ప్రేక్షకులకు అత్యున్నత ప్రమాణాలతో..ది బెస్ట్ క్వాలిటీతో విజువల్స్ వండర్ అనుభూతినిచ్చేందుకు దర్శక, నిర్మాతల చేస్తున్న ప్రయత్నమే జాప్యానికి కారణమని చిరంజీవి వివరించారు. ఇందులో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్దాసక్తులతో తీసుకుంటున్న సముచిత నిర్ణయమన్నారు.

ఈ సినిమా చందమామ కథలా సాగిపోయే అద్భుత కథతో సాగుతుందని..చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని అలరిస్తుందన్నారు. దీని గ్లింప్స్(Glimpse) నా పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రోజు ఆగస్టు 21 గురువారం సాయంత్రం 6.06గంటలకు యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారని తెలిపారు. 2026 సమ్మర్ సీజన్ లో విశ్వంభర విడుదల కాబోతుందని..ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయండని చిరంజీవి తెలిపారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌ నటించారు. కునాల్‌ కపూర్‌ ముఖ్య భూమిక పోషించారు. బాలీవుడ్‌ తార మౌనిరాయ్‌ ప్రత్యేక గీతంలో మెరిశారు.

Exit mobile version