Site icon vidhaatha

Rana Daggubati| Betting App Case| హీరో రానా దగ్గుబాటికి ఈడీ మరోసారి నోటీసులు

rana-daggubati-ed-notice-betting-app-case-august-2025

Rana Daggubati| Betting App Case| విధాత : హీరో రానా దగ్గుబాటికి(Rana Daggubati) ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో(Betting App Promotion Case) ఆగస్టు 11న హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఈడీ రానాకు నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరుకాలేదు. అయితే తాను సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నందున విచారణ తేదీ మార్చాలని రానా ఈడీని లేఖలో కోరారు. దీంతో ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలంటూ రానాకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగష్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే రానా గడువు కోరడంతో ఆయనకు వచ్చే నెల 11న హాజరుకావాలని మరోసారి నోటీస్ జారీ చేసింది.

Exit mobile version