Dacoit : ఉగాదికి మారిన డెకాయిట్ విడుదల

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్‌’ ఉగాది 2026కి వాయిదా! కొత్త రిలీజ్ పోస్టర్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Dacoit Movie Update

విధాత : అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీ ‘డెకాయిట్‌’ కు సంబంధించి మేకర్స్ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్‌ను అడివి శేష్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ‘ఈసారి మామూలుగా ఉండదు. ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి చూడాల్సిన అవసరం లేదు’ అని క్యాప్షన్ పెట్టారు. డిసెంబరు 25న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం గతంలో వెల్లడించగా.. ఇప్పుడు ఉగాదికి వాయిదా వేసింది.

షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడవి శేష్ తో జంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. బాలీవుడ్‌ దర్శక, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.