– మీడియా సమావేశంలో వెల్లడించిన బెంగళూరు పోలీస్ కమీషనర్
బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ సంచలనం రేపుతోంది. ఆ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు, రాజకీయ నాయకులు ఉన్నట్టు సమాచారం. బెంగళూరు ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఐదుగురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఐతే.. ఇదే పార్టీకి చాలా మంది లీడర్లు, సినీ నటీనటులు కూడా హాజరుకావడంతో వాళ్లెవరూ అనే ఆత్రుత అందర్లో కనిపించింది. టాలీవుడ్ నటి హేమ (Telugu Actress Hema) ఈ పార్టీకి హాజరైనట్టు వార్తలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఓ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తూ, చిల్ అవుతున్నానని హేమ ఒక విడియో విడుదల చేసింది. ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు పోలీసులు పార్టీకి హాజరైన వారి ఫొటోలు విడుదల(Photo released by Police) చేశారు. అందులో సినీనటి హేమ ఫొటో కూడా ఉంది.
అయితే, ఆమె ఈ వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిందని బెంగళూరు పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
బెంగళూరు స్థానిక మీడియా వర్గాల సమాచారం ప్రకారం, రైడ్ జరగ్గానే, హేమ బిగ్గరగా ఏడుస్తూ, తన గుర్తింపును మీడియాకు తెలియనివ్వదని వేడుకుంది. అంతే కాకుండా, వాష్‌రూమ్ వెళ్తాననే నెపంతో భవనం బయటికి వచ్చిన హేమ అదే ఫాం హౌస్‌లో ఆ విడియో రికార్డ్ చేసిందని తెలిసింది. విచిత్రంగా తాను అక్కడ లేనని విడియోలో చెప్పిన హేమ ధరించిన డ్రెస్, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్ ఒక్కటే(Same Dress in Self Video and Police Photo). ఆ విషయం గమనించని హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆ విడియో చూసిన బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు రైడ్ చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె విడియో రికార్డ్ చేయడాన్ని ఎలా అనుమతించారని తలంటారని తెలిసింది. దాన్లో భాగంగానే ఈరోజు పోలీస్ కమీషనర్ మీడియా ముందుకు రావాల్సివచ్చింది. ఆమె పార్టీలో అయితే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో తాను ఆ విడియో రికార్డ్ చేసిందో దర్యాప్తు చేసున్నామని కమీషనర్ వివరించారు.
నిజానికి పోలీసులను తప్పుదోవ పట్టించిన హేమపై పోలీసులు మరోకేసు పెట్టినట్లు సమాచారం. కేసును ఎప్పుగూడ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన కమిషనర్, ప్రస్తుతం హేమ బెంగళూరులోని ఎప్పుగూడ పోలీస్ స్టేషన్ లోనే ఉందన్నారు. పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు, వారిలో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్ టీమ్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని, అందరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నాయి. నిర్వాహకుడుగా భావిస్తున్న వాసుతో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read :
Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ
Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ
Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!
Hema| బెంగళూరు రేవ్ పార్టీలో హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగళూరు పోలీసులు