విధాత: కొండాపూర్ డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. స్నార్ట్ పబ్ యజమాని, మేనేజర్‌తో పాటు డ్రైవ్ చేసిన అభిషేక్ అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పబ్‌లో మద్యం సరఫరా చేసినందుకు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో విపరీతమైన వేగంతో డ్రైవ్ చేసి ఆశిత్ మృతికి అభిషేక్ కారణమయ్యాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.