Site icon vidhaatha

Telangana ACB Raids : ఏసీబీ వలకు మరో ఇద్దరు అవినీతి అధికారులు

ACB Arrrests Corrupt Officials

విధాత, హైదరాబాద్ : అవినీతి చేపల వేటలో తెలంగాణ ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. మంగళవారం మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక మంచిరేవులకు చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. తొలి విడతలో రూ.4 లక్షలు ఇస్తానని నమ్మించిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పథకం మేరకు వినోద్ నుంచి రూ.4 లక్షలు తీసుకుంటున్న మణిహారికను ఏసీబీ అధికారులు లంచం సొమ్ముతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరో కేసులో నారాయ‌ణపేట జిల్లా మ‌ద్దూరు తహశీల్ధార్ కార్యాలయం ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ భూమిని పాస్ బుక్ లో నమోదు చేసేందుకు భాధిత రైతును రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు నుంచి ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు.

 

 

 

Exit mobile version