బాటసారి బ్యాగులో 30లక్షల పట్టివేత

రోడ్డుపైన నడుచుకుంటూ వెలుతున్న వ్యక్తి నుంచి 30లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెహదీపట్నంలో జనార్ధన్ అనే వ్యక్తి రోడ్డుపైన నడుచుకుంటూ వెలుతున్నాడు

విధాత : రోడ్డుపైన నడుచుకుంటూ వెలుతున్న వ్యక్తి నుంచి 30లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెహదీపట్నంలో జనార్ధన్ అనే వ్యక్తి రోడ్డుపైన నడుచుకుంటూ వెలుతున్నాడు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా అతని బ్యాగు నుంచి 30లక్షల నగదు పట్టుబడింది. పూర్తి స్థాయి విచారణ నిమిత్తం జనార్ధన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.