విధాత,రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన అందిపల్లి సతీష్ (33) అనే యువకుడు దుబాయ్ లో గుండెపోటుతో బుధవారం మరణించాడు, తండ్రి నర్సింలు, తల్లి సత్తవ్వ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలరు,కుమార్తెలకు వివాహం జరిగింది, కుమారుడు సతీష్ కు 2 సంవత్సరాల క్రితం ముచ్చర్ల గ్రామానికి చెందిన సుమలత తో వివాహం జరిగింది, మృతునికి భార్య సుమలత (30) 18 నెలల కుమారుడు లోహాన్స్ ఉన్నాడు, అప్పుల బాధతో వివాహం జరిగిన ఎనిమిది నెలలకు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లగా బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడని తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు, కోరుట్ల పేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, స్థానిక ఎమ్మెల్యే కే. టి.అర్ ప్రత్యేక చొరవ తీసుకుని మృతదేహాన్ని త్వరగా గ్రామానికి చెప్పించాలని కోరుట్ల పేట సర్పంచ్ మేడిపల్లి దేవ నందం కోరాడు, సుమారు పది లక్షల వరకు అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన కుమారిని కోల్పోయిన కుటుంబానికి మంత్రిగారు చొరవ తీసుకొని ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.