నిన్న శివ‌బాల‌కృష్ణ నేడు జ‌మ్మికుంట తాహ‌సీల్దార్ ర‌జ‌నీ

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి అధికారుల అక్ర‌మాస్తుల‌పై దాడులు చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇటీవ‌లే హెచ్ఎండీఏ మాజీ డైరెక్ట‌ర్ శివ‌బాల‌కృష్ణ

  • Publish Date - March 14, 2024 / 04:04 PM IST

జ‌మ్మికుంట తాహ‌సీల్దార్ అక్ర‌మార్జ‌న రూ.12 కోట్ల‌పైనే

విధాత‌: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి అధికారుల అక్ర‌మాస్తుల‌పై దాడులు చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇటీవ‌లే హెచ్ఎండీఏ మాజీ డైరెక్ట‌ర్ శివ‌బాల‌కృష్ణ అక్ర‌మాల‌ను వెలుగులోకి తెచ్చింది. త‌న ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వ‌హించి వంద‌ల కోట్ల ఆస్తులను గుర్తించింది. తాజాగా జ‌మ్మికుంట తాహ‌సీల్దార్ ర‌జ‌ని, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో జరిపిన దాడుల్లో అక్ర‌మ‌ ఆస్తులను గుర్తించింది. వాటి విలువ రూ. 3 కోట్లుగా గుర్తించగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 12 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

హనుమకొండలో ఉంటున్న రజని ఏడు నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్‌గా విధులు నిర్వ‌హించారు అనంత‌రం ఎన్నికల సమయంలో జమ్మికుంట బదిలీ అయ్యారు. ఆమె అక్రమాలపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ నిన్న ఆమె ఇంటితోపాటు సన్నిహితులైన మరో ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు.

ఈ తనిఖీల్లో రెండంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, ఏడెకరాల వ్యవసాయభూమి, రెండుకార్లు, మూడు ద్విచ‌క్ర వాహ‌నాలు, లక్షన్నర రూపాయల నగదు, బ్యాంకులో రూ. 25 లక్షలు, కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.