విశాఖపట్నం: మధురవాడ మిథిలాపురి కాలనీలో దారుణ హత్య జరిగింది. తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న సతీష్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేసారు. దీంతో సతీష్ తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మిథిలాపూరి వుడా కాలనీ ఎన్.జి.ఓఎస్ లే అవుట్లో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.