Site icon vidhaatha

మాజీ ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు

విధాత:దొడ్డబళ్లాపురం తాలూకా మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి,ఆయన భార్యపై చీటింగ్‌ కేసు నమోదైంది.2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు కోసం నరసింహస్వామి, ఆయన భార్య నాగమణి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని, అయితే తరువాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ విలేఖరి సంగమ్‌దేవ్‌ బెంగళూరు సంజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రూ.85 లక్షలు మాత్రం అప్పు తీర్చారని, మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు.మిగిలిన డబ్బు అడిగితే తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Exit mobile version