విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ కు టిక్కెట్ కేటాయించడంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆమరణ దీక్షకు దిగి, మనస్తాపంతో బాత్రూం కు వెళ్లి విషద్రావకం తాగాడు. బాధితున్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసకుున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మి నారాయణ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.