హైద్రాబాద్‌ శివారులో భారీ అగ్నిప్రమాదం

నాంపల్లిలో ఇటీవల తొమ్మిది మందిని బలిగొన్న అగ్నిప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది

  • Publish Date - November 29, 2023 / 12:32 PM IST

విధాత : నాంపల్లిలో ఇటీవల తొమ్మిది మందిని బలిగొన్న అగ్నిప్రమాద ఘటన మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని గగన్ పహాడ్ లో ఉన్న థర్మకోల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి అగ్నికిలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ పక్కనే ఉన్న ఆయిల్ కంపెనీలోకి వ్యాపించాయి. దీంతో మంటల ఉధృతి మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టంగా పొగా అలుముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు