జర్నలిస్టు కేశవ హత్య వెనుక గుట్కా మాఫియా

విధాత‌:క‌ర్నూలు జిల్లాలో ఓ గుట్కా మాఫియా.. జర్నలిస్టు కేశ‌వ‌ను అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఆ గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలన్నింటికీ రుజువులు తీసుకొచ్చి త‌ను ప‌నిచేసే యూట్యూబ్ చానెల్లో ప్రసారం చేయించాడు. అంతే ముఠాకు చిర్రెత్తుకొచ్చింది. ప్రాణాల మీద‌కు వ‌చ్చింది.కర్నూలు జిల్లాలో గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో వీ5 యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య గుట్కా మాఫియాతో చేతులు […]

  • Publish Date - August 9, 2021 / 07:15 AM IST

విధాత‌:క‌ర్నూలు జిల్లాలో ఓ గుట్కా మాఫియా.. జర్నలిస్టు కేశ‌వ‌ను అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఆ గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలన్నింటికీ రుజువులు తీసుకొచ్చి త‌ను ప‌నిచేసే యూట్యూబ్ చానెల్లో ప్రసారం చేయించాడు. అంతే ముఠాకు చిర్రెత్తుకొచ్చింది. ప్రాణాల మీద‌కు వ‌చ్చింది.
కర్నూలు జిల్లాలో గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో వీ5 యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య గుట్కా మాఫియాతో చేతులు క‌లిపి చేస్తున్న దురాగతాల పై తన యూట్యూబ్ ఛానల్ లో వార్త రాశాడు. దీని ఆధారంగానే ఇటీవల ఎస్పి కానిస్టేబుల్ సుబ్బ‌య్య‌ను సస్పెండ్ చేశారు. దీనిపై ఆ కానిస్టేబుల్‌ కక్ష కట్టాడు అని కేశవ స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

నంద్యాల‌లో ఎన్జీవో కాలనీ లో హాస్టల్ దగ్గర ఉండగా కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరు వచ్చి స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి గాయపరిచి పారిపోయారని కేశవ స్నేహితుడు ఎస్పీకి తెలిపారు. తీవ్రంగా గాయపడిన రక్తస్రావం అయిన కేశవను ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందినట్లు వెల్ల‌డించారు. విష‌యం తెలిసిన వెంట‌నే ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి సంఘ‌ట‌న స్థ‌లాన్ని పరిశీలించారు. పరారిలో ఉన్న నిందితుల కోసం రెండు టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు. విలేఖరి హత్యకు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని తమ్ముడు నాని ప్రమేయం ఉన్నట్లుగా మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై డిజిపి కార్యాల‌యం కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. హ‌త్య‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తుకు ఆదేశించింది.
ప్రత్యక్ష సాక్షి ఎస్పీకి తెలిపిన వివ‌రాల మేరకు రిపోర్ట‌ర్ కేశ‌వ‌ను మాట్లాడటానికి పిలిచి ఆ ఇద్దరు వ్యక్తులు వెంటాడి స్కూడ్రైవర్ తో పొడిచి హత్య చేశారని తెలుస్తోంది. రిపోర్ట‌ర్ కేశవ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య గుట్కా వ్యాపారస్తులతో సత్సంబంధాలు నిర్వహిస్తున్న ఆడియో వైరల్ చేశాడు.