విధాత, హైదరాబాద్: రేవంత్ రెడ్డి పై మైహోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2014 లో మై హోమ్ భుజా కు సంబందించిన భూమి విషయంలో ఆక్రమణలు జరిగాయని రేవంత్‌రెడ్డి ఆధారాలతో సహా పత్రికా సమావేశంలో ప్రశ్నించారు. దీంతో ఆయనపై మై హోం రామేశ్వర్‌రావు 90 కోట్ల కు పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కౌంటర్ కేసు నమోదు చేశారు. ఆ కేసును పరిశీలించిన హైకోర్టు నిరాధారమైనదని బావించి కొట్టివేసింది.