విధాత: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని శిరీష అనే యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి 18సార్లు పొడిపొడిచాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని నవీన హాస్పిటల్ కి తరలించగా వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా దాడి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.