ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ప్ర‌దీప్ శ‌ర్మ‌కు యావ‌జ్జీవం

ముంబై హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ప్ర‌దీప్ శ‌ర్మ‌కు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది

  • Publish Date - March 19, 2024 / 04:37 PM IST

విధాత‌: ముంబై హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ప్ర‌దీప్ శ‌ర్మ‌కు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయ‌న‌తో పాటు మ‌రో 12 మంది పోలీసుల‌కు కూడా శిక్ష విధించింది. 2006లో అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ చోటా రాజ‌న్ అనుచ‌రుడైన ల‌క‌న్‌ భ‌య్యాను ఫేక్ ఎన్‌కౌంట‌ర్ పేరిట చంపిన కేసులో ఆయ‌న‌కు మంగ‌ళ‌వారం ముంబై హైకోర్టు యావ‌జ్జీవ కారా గార శిక్ష విధిస్తూ తీర్పు వెల్ల‌డించింది. ఫేమ‌స్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్ర‌దీప్ శ‌ర్మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించాడు. చ‌రిత్ర‌లో మొద‌టి సారిగా పోలీస్ అధికారితో పాటు త‌న అనుచ‌రుల‌కు ఇంత పెద్ద శిక్ష‌ప‌డ‌టం ఇదే మొద‌టి సారికావ‌డం గ‌మనార్హం. పోలీసు అధికారుల‌తో పాటు వేరే వ్య‌క్తుల‌కు కూడా కోర్టు శిక్ష విధించింది కానీ వారు ఇంత‌కు ముందే మ‌ర‌ణించారు.

జస్టిస్ రేవతి మోహితే డేరే, గౌరీ గోడ్సేల‌ ధర్మాసనం ముందుకు నవంబర్ 8, 2023లో ఈ కేసు వ‌చ్చింది. గ‌తంలోనే ప్ర‌దీప్ శ‌ర్మ‌పై ఉన్న ఈ కేసును కొట్టివేయ‌డంతో మూడు వారాల్లో కోర్టుకు స‌రెండ‌ర్ కావాల‌ని ద‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. అనంత‌రం ప్ర‌దీప్ శ‌ర్మ చేసిన చ‌ట్ట వ్య‌తిరేక‌ప‌నుల‌ను, ఫేక్ ఎన్‌కౌంట‌ర్‌ల‌ను ప‌రిశీలించి ప్ర‌దీప్ శ‌ర్మ‌ను అత‌ని అనుచ‌రుల‌ను దోషులుగా ప్ర‌క‌టించి యావ‌జ్జీవ కార‌గార శిక్ష విధించింది.