విధాత: హైదరాబాద్ కేంద్రంగా దర్భంగా కేసు విచారణ జరుగనుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్, హాజీ సలీం, ఖాఫిల్‌లను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం వరకు ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. హైదరబాద్ కేంద్రంగా బాంబ్ తయారి చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి విచారణ కొనసాగనుంది. బాంబ్ తయారీ, అమర్చిన తీరుపై ఎన్‌ఐఏ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో నిందితులను ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌ఐఏ టీమ్ హైదరాబాద్‌కు చేరుకుంది.