క‌న్న కూతురిపైనే కీచ‌క తండ్రి కామాంద ప‌ర్వం

భోపాల్ : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన క‌న్న‌తండ్రే కూతురు ప‌ట్ల కీచ‌కుడిగా మారాడు. 19 ఏండ్ల వ‌య‌సున్న కూతురుపై మూడేండ్లుగా తండ్రిన‌న్న విష‌యం మ‌రిచి అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని అయిష్‌బాగ్ ఏరియాలో చోటు చేసుకుంది. మూడేండ్ల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తూ.. బ‌య‌ట‌కు విష‌యం చెబితే చంపేస్తాన‌ని బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌స్తున్నాడు ఆ క‌సాయి తండ్రి. సోమ‌వారం కూడా తండ్రి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే.. […]

  • Publish Date - June 23, 2021 / 06:06 AM IST

భోపాల్ : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన క‌న్న‌తండ్రే కూతురు ప‌ట్ల కీచ‌కుడిగా మారాడు. 19 ఏండ్ల వ‌య‌సున్న కూతురుపై మూడేండ్లుగా తండ్రిన‌న్న విష‌యం మ‌రిచి అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని అయిష్‌బాగ్ ఏరియాలో చోటు చేసుకుంది. మూడేండ్ల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తూ.. బ‌య‌ట‌కు విష‌యం చెబితే చంపేస్తాన‌ని బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌స్తున్నాడు ఆ క‌సాయి తండ్రి.

సోమ‌వారం కూడా తండ్రి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే.. తల్లిని, సోద‌రుడిని కిటికీలో నుంచి బ‌య‌ట‌కు తోసేస్తాన‌ని బెదిరించాడు. తండ్రి వేధింపులు భ‌రించ‌లేని ఆ యువ‌తి త‌న త‌ల్లితో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మూడేండ్ల క్రితం తాను ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో తండ్రి త‌న‌ను అత్యాచారం చేశాడ‌ని, ఎవ‌రికైనా చెబితే త‌మ్ముడిని చంపేస్తాన‌ని బెదిరించా డ‌ని బాధిత యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Readmore:పుష్కరఘూట్ లో అత్యాచారం జరిగిన ప్రదేశం ను పరిశీలించిన రాష్ట్ర తెలుగుమహిళా విభాగం మరియు టీడీపీ బృందం