మేడ్చల్ మల్కాజ్‌గిరి :కరోనా కాలంలో ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు నకిలీగాల్లు. సుచిత్రలో నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ఓ మెడికల్ షాపు నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఇంజెక్షన్లకు ఒరిజినల్ స్టిక్కర్ వేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించి నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి నకిలీ ఇంజెక్షన్లు తయారు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి ఆ మెడిసిన్ తయారీకి సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.